పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్య

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

లక్సెట్టిపేట: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మున్సిపాలిటీ పరిధి లో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు మోదెల గ్రామానికి చెందిన బాకం రాజన్న (57)కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 24న అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించా రు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. ముందుగా స్థానిక ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement