రెండు ప్రాణాలను బలిగొన్న అతివేగం | - | Sakshi
Sakshi News home page

రెండు ప్రాణాలను బలిగొన్న అతివేగం

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

● ఆటోను ఢీకొట్టిన లారీ ● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఆదిలాబాద్‌రూరల్‌: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందుగా వెళ్తున్న లారీని మ రో లారీ ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మ రో ఇద్దరికి గాయాలయ్యాయి. మావల సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాల మే రకు తలమడుగు మండలం పల్లీ గ్రామానికి చెంది న ఆనంద్‌, నారాయణ, భీంరావ్‌ కూరగాయల వ్యా పారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం గ్రామానికి చెందిన నగేష్‌ ఆటోలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో మావల పోలీస్‌స్టేషన్‌ పరిఽ దిలోని జాతీయ రహదారి 44పై ఓ లారీ ముందుగా వెళ్తున్న మరో లారీని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో జా తీయ రహదారికి ఆనుకుని ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆనంద్‌ (65)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అ ందించడంతో క్షతగాత్రులను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి నారాయణ (48) మృతి చెందాడు. భీంరావ్‌, నగేష్‌లు స్వల్పగాయాలో బయటపడ్డారు. మృతులు నారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారు డు, ఆనంద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement