గుడిహత్నూర్: ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి ఒక్కసారిగా పొగలు కమ్ముకున్న సంఘటన జాతీయ రహదారి 44 డోంగర్‌గావ్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఆదిలాబాద్ బస్టాండ్‌లో 30 మంది ప్రయాణికులను ఎక్కించుకుని నిర్మల్ బయలుదేరిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు కేవలం కిలోమీటరు దూరం వెళ్లగానే ఇంజిన్, సైలెన్సర్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ బస్సును హైవే పక్కన నిలిపి ప్రయాణికులను కిందికి దింపాడు. బస్సు బీఎస్–6 వాహనం కావడంతో సైలెన్సర్ జామ్ కావడంతో పొగలు చిమ్మినట్లు డ్రైవర్ గుర్తించాడు. వెంటనే సైలెన్సర్‌ను క్లీన్ చేయడంతో సమస్య పరిష్కారమైంది. కాగా డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


