బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఉప ఆలయంలో మహాకాళి అమ్మవారి కిరీటం చోరీకి గురికావడం బాధాకరం. 2024 ఆగస్టులో దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలోని ఉపాలయంలో హుండీ చోరీ ఘటన భక్తులు మర్చిపోలేదు. మళ్లీ చోరీ జరగడంతో భక్తుల్లో ఆందోళన పెరిగింది. ఆలయ భద్రతను మరింత పటిష్టం చేసి, దొంగలను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
– స్నేహారెడ్డి, భక్తురాలు, ఆదిలాబాద్
బాధాకరం
అమ్మవారి ఆలయం అంటే భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం. గతంలో హుండీ చోరీ, ఇప్పుడు మహాకాళి అమ్మవారి కిరీటం దొంగిలించడం బాధాకరం. ఆలయ ప్రాంగణంలో 24 గంటల నిఘా, ఆధునిక భద్రతా వ్యవస్థలు, అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలి. భక్తుల విశ్వాసానికి భంగం కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
– లక్ష్మీప్రియ, భక్తురాలు,
హైదరాబాద్


