శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల డిమాండ్లపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు గురువారం సింగరేణి సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతిని కలిశారు. హైదరాబాదులోని సింగరేణి భవన్‌లో సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. కార్మికుల 31 డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సీఎండీతో చర్చించారు. చాలా కాలంగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, పరిష్కరించని యెడల సమ్మె తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు గౌతం పొట్రు(పా), ఎల్వీ సూర్యనారాయణ(ఆపరేషన్స్), కే.వెంకటేశ్వర్లు(పీపీ), గుర్తింపు సంఘం నాయకులు మిర్యాల రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.


