ఆదిలాబాద్‌టౌన్: ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్, సీసీఐ పరిశ్రమ అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఈ అంశాలపై వెంటనే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వాటిపై స్పష్టమైన ప్రణాళికలు లేకపోయినా అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుౖ పె స్పష్టత ఇవ్వలేకపోతున్నా స్థానిక ఎమ్మెల్యే డీపీఆర్ పూర్తయిందంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్‌ను ఏరోస్పేస్ జోన్‌గా గుర్తించి, ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రూ.8 కోట్లతో సర్వేపూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే రేణుక సి మెంట్ పరిశ్రమ ఏర్పాటుకురూ.4కోట్లతో సర్వే లు నిర్వహించగా, వాటిని అడ్డుకున్నది ప్రస్తుత నాయకులేనని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, నారాయణ, ప్రహ్లా ద్, వసంత్, గణేష్, దమ్మపాల్, దివిటి రాజు, ఆసిఫ్, మహేష్, సాయి పాల్గొన్నారు.


