‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యం .. విద్యార్థులకు శాపం’ | - | Sakshi
Sakshi News home page

‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యం .. విద్యార్థులకు శాపం’

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

కై లాస్‌నగర్‌: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కావడానికి కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఇది విద్యార్థులకు శాపంగా మారిందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష నిర్వహణ లోపాలతో నష్టపోతున్న విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చాత్రోంకి గూంజ్‌ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ పోరాటాన్ని ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రుల వద్దకు బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో మార్కెట్‌, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు శ్రీకాంత్‌రెడ్డి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement