న్యూస్‌రీల్
ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో టాయ్‌లెట్స్ కొరతతో విద్యార్థినులకు తిప్పలు తప్పడం లేదు.
గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026
ఈ రైతు పేరు పెండే లక్ష్మణ్. తాంసి మండలం వడ్డాడి గ్రామం. మూడున్నర ఎకరాల్లో ఏడు పత్తి బ్యాగుల విత్తనాలను జూన్ 10న పొడిదుక్కుల్లోనే వేశాడు. రెండు మామూలు వర్షాలతో మొలకలు వచ్చినట్టే వచ్చాయి. తర్వాత వరుణుడి జాడ లేకపోవడంతో విత్తనం ఉబ్బిపోయి నష్టపోవాల్సి వచ్చింది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల తర్వాత మంగళవారం మళ్లీ ఏడు బ్యాగుల విత్తనాలు విత్తాడు.
ఈ రైతు పేరు కాటిపెల్లి చంద్రశేఖర్ రెడ్డి. ఇచ్చోడ. పదెకరాల్లో 20 బ్యాగుల పత్తి విత్తనాలు వారం క్రితం వేశాడు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక 30 శాతం మొలకెత్తలేదు. దీంతో నష్టపోయిన చోట మళ్లీ విత్తనాలు వేస్తున్నాడు.
ఈ రైతు పేరు ఉప్పు శంకర్. నేరడిగొండ మండలం వడూర్. మూడు రోజుల క్రితం పొడిదుక్కుల్లోనే పదెకరాల్లో పది బ్యాగుల పత్తి విత్తనాలు వేశాడు. ప్రస్తుతం వర్షాలు పడడంతో ఇప్పుడు అవి మొలకెత్తుతాయని ఎదురుచూస్తున్నాడు.


