‘ప్రగతి’ నిరంతర ప్రక్రియ కావాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి’ నిరంతర ప్రక్రియ కావాలి

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

● ‘ప్రజాపాలన’ జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు

కై లాస్‌నగర్‌: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్ర ఐజీ, ప్రజాపాలన జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరుపై బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 99 రోజుల కార్యక్రమం ముగిసినప్పటికీ దాన్ని ఆపకుండా భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో కొనసాగించాలనారు. గ్రామ, మండల సభల్లో ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత, కమ్యూనిటీ సంస్థాగత వినతులను అన్ని శాఖల అధికారులు క్రోడీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇచ్చిన హామీలపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికకు సంబంధించిన బుక్‌లెట్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌.చిత్రు, రాజేశ్వర్‌, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం

నేరడిగొండ: ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్‌ హనుమంతు అన్నారు. నేరడిగొండ పీహెచ్‌సీని బుధవారం సందర్శించారు.హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ ఎంఏ కలీం, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సద్దాం, హెచ్‌ఈవో పవార్‌ రవీందర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ సంతోష్‌, స్వర్ణలత, సిబ్బంది ఉన్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఐజీ

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఐజీ, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆదిలాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఆరా తీఽశారు. ట్రెయినీ సబ్‌ రిజిస్ట్రార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న కార్యాలయానికి కొత్త భవనం కేటాయించాలని సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీలత ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ..

పట్టణంలోని అంబేద్కర్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న అస్మా బేగం, రెహనా బేగం ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్‌ రాజర్షి షాతో కలిసి ఆయన పరిశీలించారు. ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపులు, ఇతర వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌.చిత్రు, రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, హౌసింగ్‌ పీడీ శంకర్‌, డీఈ షాకీర్‌, అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement