డ్రగ్స్‌ రహిత సమాజం లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజం లక్ష్యం

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

● ‘వాల్‌ ఆఫ్‌ ప్రామిస్‌’పై సంతకం చేసిన ఎస్పీ

ఆదిలాబాద్‌టౌన్‌: డ్రగ్స్‌, గంజాయి వంటి మా దకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బుధవారం నిర్వహించి న డ్రగ్స్‌ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ‘వాల్‌ ఆఫ్‌ ప్రామిస్‌’పై సంతకం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై సమాజమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ‘యాంటీ డ్రగ్స్‌ సోల్జర్‌’గా పోరాడుతామని ఏర్పా టు చేసిన ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ వద్ద విద్యార్థులు, యువత సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో ఆది లాబాద్‌ డీఎస్పీ జీవన్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు బి.సునీల్‌ కుమార్‌, కె.ఫణీదర్‌, ప్రణయ్‌ కుమార్‌, ఎస్సైలు అశోక్‌, సంజయ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సత్వర న్యాయం అందించేందుకు చర్యలు

బాధితులకు సత్వర న్యాయం, వైద్య, న్యాయ, మా నసిక సహాయ సేవలు అందించేందుకు ప్రత్యేక చ ర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అన్నారు. భరోసా కేంద్రం ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశం నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్య త ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మౌనిక, భరోసా సెంటర్‌ ఇన్‌చార్జి పద్మ, భరోసా సెంటర్‌ కోఆర్డినేటర్లు ప్రనూష, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మత్తు నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం

మత్తు వ్యసనాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అన్నారు. రిమ్స్‌లోని డీఅడిక్షన్‌ సెంటర్‌ ను పరిశీలించారు. చికిత్స విధానం, సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలువాటు పడిన వ్యక్తుల కు వైద్య సలహాలు, కౌన్సెలింగ్‌ ద్వారా చికిత్స అందిస్తూ వారిని ఆరోగ్యవంతమైన జీవనంలోకి తీసుకురావడానికి దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆయ న వెంట ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, మా వల సీఐ ప్రేమ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలను కట్టుదిట్టం చేయాలి

జిల్లాలో రోడ్డుప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ ని బంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశించారు. బుధవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. సిబ్బంది పనితీరు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు, పెండింగ్‌ కే సులు,ఈ–చలాన్ల అమలు తదితర అంశాలను స మీక్షించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల నియంత్రణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.హెల్మె ట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగం, అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ ప్రణయ్‌ కుమార్‌, ఆర్‌ఎస్సైలు దేవేందర్‌, మనీ ష్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement