అర్హులకే సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే సంక్షేమ పథకాలు

Jun 24 2026 8:22 AM | Updated on Jun 24 2026 8:22 AM

కై లాస్‌నగర్‌: ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎ వరైనా అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందాలని, ఆ దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైనథ్‌ మండల కేంద్రానికి చెందిన 111 మంది డబు ల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారులకు పీఏసీఎస్‌ చైర్మ న్‌ గోవర్దన్‌రెడ్డితో కలిసి ఇంటి పట్టాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఇళ్లు దక్కనివారు అధైర్యపడవద్దని, డబుల్‌ ఇళ్లకు పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో ఇంటిస్థలాలతో పాటు ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని భరోసాఇచ్చారు. ఇందులో జైనథ్‌ సర్పంచ్‌ మమత, ఉప సర్పంచ్‌ సంతోష్‌, ఆత్మ డివిజన్‌ చైర్మన్‌ సంతోష్‌, జైనథ్‌ తహసీల్దార్‌ నారాయణ, ఆర్‌ఐలు ఉల్లాస్‌, హన్మంత్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement