ఆదిలాబాద్: ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గోడం నగేశ్ రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌కు విన్నవించారు. ఢిల్లీలో సోమవారం రాత్రి ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ఈ రైల్వేలైన్ ఏర్పాటైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు ఈ లైన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ప్రా జెక్టుకు సంబంధించి అప్రూవల్ ప్రక్రియ చివరి దశలో ఉందని, త్వరతగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


