అంతా ఆఫ్
సాక్షి,ఆదిలాబాద్: ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన టెండర్ ప్రక్రియను ఆదిలాబాద్ మున్సిపల్‌లో ఆఫ్‌లైన్‌లో చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ టెండర్లను అస్మదీ యులకు అప్పజెప్పేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైకి ఆన్‌లైన్ టెండర్ అని చెబుతున్నప్పటికీ.. ఆ వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఆఫ్‌లైన్‌లో టెండర్ ము గించి తామనుకు న్న వారికి ప నులు అప్పజెప్పేందుకు అక్రమంగా వ్యూహ రచన చేశారని తెలుస్తోంది. ఈ వ్య వహారంలో ము న్సి పల్‌కు చెందిన ఓ కీలక ఇంజినీరింగ్ అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తి..
ఈ పనులు నిర్వహించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎన్ని వచ్చాయనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయని చెబుతున్నారే తప్పితే.. నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ వివరాలు వెల్లడించడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా టెండర్ ప్రక్రియ నిర్వహించినప్పుడు దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయడం నిబంధన. ఈ విషయంలో మున్సిపల్ అధికారి వివరణ కోరినప్పుడు మొదట ఐఅండ్‌పీఆర్‌కు టెండర్ నోటిఫికేషన్ వివరాలు పంపడం జరిగిందని, ఆ నోటిఫికేషన్ ఏ పత్రికలో వచ్చిందో స్ప ష్టత లేదని.. అక్కడి నుంచి బిల్లుల కోసం వారు పంపినప్పుడు తెలుస్తుందని అన్నారు. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ విషయంలో మరోసారి ఆ అధికారిని వివరాలు కోరినప్పుడు ఓ ప్రధాన పత్రికలో 12వ తేదిన, 15వ తేదిన వచ్చిందని, తన దగ్గర ఆ వివరాలు లేవని, సెక్షన్ అధికారి వద్ద ఉన్నాయని, సమయం దాటిపోవడంతో ఈ రోజు ఆ వివరాలు ఇవ్వలేనని ఆ అధికారి పేర్కొన్నారు.
నిబంధనలు ఇలా..
సాధారణంగా రూ.2లక్షలు పైబడిన వర్క్‌ను తప్పనిసరి ఆన్‌లైన్‌లో చేపట్టాలి. దానికి సంబంధించి ముందుగా పేపర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. త ద్వారా కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ పేపర్ నోటిఫికేషన్ ప్ర స్తుతం తన వద్ద లేదని అధికారి చెప్పడం వెనుక పె ద్ద మతలబే ఉందనే విమర్శలున్నాయి. తాము అనుకున్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు ఈ వ్యవహారాన్ని మున్సిపల్‌లో ఓ కీలక ఇంజినీర్ చక్రం తిప్పారనే ప్రచారం సాగుతుంది.
గూడుపుఠాణి..
రూ.50లక్షల పనిలో రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు మున్సిపల్ అధికారి స్పష్టం చేశారు. ఈ రెండు దరఖాస్తుల్లో ఓ కాంట్రాక్టర్ బిడ్ కెపాసిటీ కలిగి లేకపోవడంతో అర్హత సాధించలేకపోయాడని వివరించారు. మరో కాంట్రాక్టర్‌కు పూర్తి అర్హతలు ఉన్నట్లుగా తెలిపారు. ఈ వర్క్ ఎవరికి దక్కిందనేది బుధవారం స్పష్టం చేయనున్నట్లు చెప్పారు. ఈ వర్క్‌ను తమ అస్మదీయుడికి అప్పగించేందుకే ఇలా ఆఫ్‌లైన్‌లో టెండర్ నిర్వహించారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. మరో దరఖాస్తు బిడ్ కెపాసిటీ లేని కాంట్రాక్టర్ ద్వారా వేయించడం వెనుక గూడుపుఠాణి దాగి ఉందని తెలుస్తోంది. ఇక రెండో పని రూ.15లక్షల వర్క్‌లో ఒకరే టెండర్ దాఖలు చేశారని, ఆయనకు కూడా బిడ్ కెపాసిటీ లేకపోవడంతో రెండోసారి టెండర్ రీకాల్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారి స్పష్టం చేస్తున్నారు.
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని మావల, కేఆర్‌కే కాలనీల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) రూ.50లక్షలు, రూ.15లక్షలతో రెండు వేర్వేరు పనులు చేపట్టేందుకు ఈ టెండర్లు పిలిచారు. వీధి దీపాలతో పాటు జంక్షన్‌లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం టెండర్లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఆఫ్‌లైన్‌లో చేపట్టారనే ఆరోపణలు
వ్యక్తమవుతున్నాయి.


