మహిళా సాధికారతకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు ప్రాధాన్యత

Jun 24 2026 8:22 AM | Updated on Jun 24 2026 8:22 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. మండలంలోని మామిడిగూడ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, మహిళా సంఘాల బలోపేతానికి, ఆర్థికస్వావలంబనకు వీవో భవనాలు దోహ దపడతాయన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే పిప్పల్‌ధరి గ్రామంలో బోనగిరి నారాయణ ఇంటిని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కలెక్టర్‌ ప్రభుత్వ పథకాల అమలుతీరు, గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గో వింద్‌, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ధ్రువీకరణ విత్తనాలనే కొనుగోలు చేయాలి

ధ్రువీకరణ విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని కలెక్టర్‌ అన్నారు. మండలంలోని అంకోలిలో ఏ ర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 86 రైతు వేదికల ద్వారా వికేంద్రీకృత పద్ధతిలో విత్తనాల పంపిణీ చేపడుతున్నామన్నారు. విత్తన మేళా ద్వారా సోయా 1,273.015 క్వింటాళ్లు, కంది 147.73 క్వింటాళ్లు, పెసర 30.44 క్వింటాళ్లు, మినుము 22.17క్వింటాళ్లు, నానో యూ రియా 3,053 సీసాలు, నానో డీఏపీ 1,965 సీసాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపా రు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తన మేళాలు జూన్‌ 23 నుంచి వారం పాటు కొనసాగుతాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌ శాఖలతో కూడిన ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తాయని, నకిలీ విత్తనాల విక్రయదారులపై సీడ్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను రద్దు చేస్తామన్నారు.

ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి

కైలాస్‌నగర్‌: జిల్లాలో ఓటర్ల జాబితా రూపకల్ప న, సవరణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బీఎల్‌వోలు, ఎన్నికల విభాగం అధికారులతో స మీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్ర జాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా బీఎల్‌వోల మ్యాపింగ్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. మ్యాపింగ్‌ ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని సహించబో మ న్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రు, ఆర్డీవో పి.జగదీశ్వర్‌రావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నలంద ప్రియ, తహసీల్దార్లు, మాస్టర్‌ ట్రైనర్లు, బూత్‌ లెవెల్‌ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement