నైపుణ్యాలకు డ్యూటీ మీట్‌ దోహదం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలకు డ్యూటీ మీట్‌ దోహదం

Jun 24 2026 8:22 AM | Updated on Jun 24 2026 8:22 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: అధికారులు, సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు డ్యూటీ మీట్‌లు దోహదపడతాయని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నా రు. స్థానిక పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లాస్థాయి డ్యూటీ మీట్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని జోనల్‌, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. డ్యూటీ మీట్‌లో భాగంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌, క్రిమినల్‌ లా, మెడికో లీగల్‌ టెస్ట్‌, ఫింగర్‌ ప్రింట్‌ సైన్స్‌, లిఫ్టింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌ ఆఫ్‌ ఎగ్జిబిట్స్‌, క్రైమ్‌ సీన్‌ ఫొటోగ్రఫీ, పోలీస్‌ పోర్ర్‌టెయిట్‌, అబ్జర్వేషన్‌ టెస్ట్‌, యాంటీ సబటేజ్‌ చెక్‌, డాగ్‌ స్క్వాడ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ తదితర 11 విభాగాల్లో పోటీలు, రాత, ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేరస్తులు అనుసరిస్తున్న కొత్త పద్ధతులను అర్థం చేసుకుని, నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా పోలీసులు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరన్నారు. ఎస్పీ స్వయంగా ఫింగర్‌ ప్రింట్లు తీసే విధానం ప్రదర్శించి సిబ్బందికి శిక్షణ అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్‌ రావు, డీఎస్పీలు ఎల్‌.జీవన్‌ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్‌, ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఫింగర్‌ప్రింట్‌, ఎన్‌ఐబీ, డీసీఆర్‌బీ, బీడీ టీం, డాగ్‌ స్క్వాడ్‌, రిజర్వ్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన డీవైఎస్‌వో

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దయానంద్‌ రెడ్డి మంగళవారం ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట రమేశ్‌ తదితరులున్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం

తలమడుగు: డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మండలంలోని సుంకిడి గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ రహీం పాషా, ఎస్సైలు రాధిక, జీవన్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సమ్మ, ఉపసర్పంచ్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement