ఆదిలాబాద్: త్వరలోనే ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించినట్లు వెల్లడించారు. జిల్లా ప్రగతికి విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణానికి ఇప్పటికే గుర్తించిన 1,880 ఎకరాలకు అదనంగా మరో 400 ఎకరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తక్షణమే భూమిని అప్పగించడంతో పాటు, టెర్మినల్ భవనం, విమాన రాకపోకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఒప్పందం కుదిరిందని వివరించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.300 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.600 కోట్ల కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. విమానా శ్రయం ద్వారా ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలి పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రఽ దానమంత్రి, కేంద్ర మంత్రుల సమక్షంలో నిర్మాణా నికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అలాగే ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇందులో నాయకులు జోగు రవి, పోషన్న,ధోని జ్యోతి, దయాకర్, నరేష్, విలాస్, రాకేవ్, భీమ్ సేన్ రెడ్డి, శివ, గోపి తదితరులు పాల్గొన్నారు.


