పాఠశాలల బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల బంద్‌ విజయవంతం

Jun 24 2026 8:22 AM | Updated on Jun 24 2026 8:22 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ మంగళవారం విజయవంతమైంది. ప్రైవేట్‌ పాఠశాలలు స్వచ్ఛందంగా పాల్గొనగా పట్టణంలో తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పరిషత్‌ నాయకులు బంద్‌ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్‌ ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాం, పుస్తకాలు, నోట్‌బుక్‌లు, షూ, ఇతర వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. కార్యక్రమంలో పరిషత్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement