కై లాస్‌నగర్: పర్యావరణం పరిరక్షించేలా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను వందశాతం సాధించాలని ఎఫ్‌డీవో చిన్నవిశ్వనాథ్ బూసిరెడ్డి అన్నారు. వనమహోత్సవ కార్యక్రమ నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 39లక్షల 500 మొక్కలను ప్రభుత్వం లక్ష్యంగా ఖరారు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వనమహోత్సవంలో పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. వారి తో మొక్కలు నాటించడంతో పాటు సంరక్షించే బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ మాట్లాడుతూ, మొక్కలు నాటే ఫొటోలను జిల్లా అధికా రుల గ్రూప్‌లో తప్పనిసరిగా పోస్టు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


