ఆదిలాబాద్‌టౌన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ అర్హత సాధించిన విద్యార్థుల సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రా రంభమైంది. పట్టణంలోని సంజయ్‌గాంధీ పాలిటెక్నికల్ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పరిశీలనలో తొలి రోజు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ముందుగా నమోదు చేసుకున్న ప్రకారం సర్టి ఫికెట్లను పరిశీలించారు.తొలి రోజు 210 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 202 మంది హాజరైనట్లుగా ప్రిన్సిపాల్ డి.నరేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


