బీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

● ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌

నేరడిగొండ: బీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌ జాదవ్‌ అన్నారు. భీంపూర్‌ మండలంలోని కామట్‌వాడ సర్పంచ్‌ మడావి మాధవ్‌రావ్‌, ఉప సర్పంచ్‌ గోవింద్‌ తమ అనుచరులు 75 మందితో కలిసి సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటన తర్వాత చాలా మంది బీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నా రు. రాబోయేది మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌, సీనియర్‌ నాయకులు కేమ శ్రీకాంత్‌, మాజీ ఎంపీపీ సంతోష్‌, మాజీ సర్పంచ్‌ లింబాజీ, రమణరెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement