ఆసనాలు అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఆసనాలు అదుర్స్‌

Jun 22 2026 12:06 AM | Updated on Jun 22 2026 12:06 AM

● ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ● హాజరైన కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీ, ఐటీడీఏ పీవో

యోగా ఆసనాలు వేస్తున్న కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌టౌన్‌:/కై లాస్‌నగర్‌: యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషతో కలిసి కలెక్టర్‌ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిక్షకుల సూచనలకు అనుగుణంగా ఆసనా లు ఆచరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, యోగాతో మానసిక ఒత్తిడిని దూరం కావచ్చన్నారు. బ్రహ్మ కుమారీస్‌కు సంబంధించిన యోగా పోస్టర్‌ ఆవిష్కరించి, శిక్షకులను సన్మానించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డీఎంహెచ్‌వో సాధన, డీపీఆర్వో విష్ణువర్ధన్‌, డీవైఎస్‌వో దయానంద్‌ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఈవో మాధవి, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, ఆయుష్‌ వైద్యులు చంద్ర శేఖర్‌, ప్రీతి, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ పరేడ్‌ మైదానంలో

పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ హాజరై యోగా ఆసనాలు చేశారు. అదనపు ఎస్పీ సురేందర్‌ రావు, డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో..

జిల్లా కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రభాకర రావు మాట్లాడుతూ యోగా నిత్య సా ధనతో రోగాలు దరిచేరవని పేర్కొన్నారు.ఇందులో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, జడ్జిలు హుస్సేన్‌, డ్యానిరుత్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

జిల్లా జైలులో..

జిల్లా జైలులోనిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది, ఖైదీలు యోగా ఆసనాలు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ గోపి రెడ్డి, జైలర్‌ చంద్రశేఖర్‌, సుధలక్ష్మి, సాయికిరణ్‌, నాగరాజు, అంజయ్య, సాంబయ్య, రమేశ్‌, మోసిన్‌, దామోదర్‌, సునిత, అశో క్‌, మహేందర్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ కార్యాలయంలో..

ఉట్నూర్‌రూరల్‌: స్థానిక కుమురంభీం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి పీవో మకరందు ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు, ఆశ్రమ గిరిజన విద్యార్థినులతో కలిసి యోగాసనాలు ఆచరించారు. ఇందులో ఏపీవో వసంతరావు, ఏపీవో (పీవీటీజీ) ఆత్రం భాస్కర్‌, డీడీ ప్రేమకళ, డిప్యూటీ డీఈ చందన్‌పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement