నేరడిగొండ: తెలంగాణ భవిష్యత్తు బీఆర్‌ఎస్ దేన ని, బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్ర జలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఎమ్మె ల్యే డాక్టర్ అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గుత్పాల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు మళ్లీ గు లాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారిలో ఉడుగుల సురేష్, బట్టు నర్సయ్య, ఒడ్డెపల్లి సురేష్, దావుల ఆడేళ్లు, ఉడుగు ల పెద్ద గంగయ్య, కొండ గంగయ్య, బోగి మల్ల య్య, దశకంటి రాములు, దావుల శివయ్య, సుధీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంజు, లక్ష్మణ్, భీంరావ్, భాస్కర్, సాగర్, కృష్ణ, సంతోష్, రాజు తదితరులున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సోమేశ్, రాథోడ్ సురేందర్, సుజీల్, సాబ్లే సంతోష్, బాబులాల్, కై లాస్ తదితరులు పాల్గొన్నారు.


