కై లాస్‌నగర్: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ జిల్లాలో ప్ర శాంతంగా ముగిసింది. 1,763 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఏడు కేంద్రాలను ఏర్పాటు చే శారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష సాగింది. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో విద్యార్థులను ఉదయం 11 నుంచి మ ధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం ముగిసిన వెంటనే గేట్ల ను మూసివేశారు. పరీక్షకు 1583 మంది హాజరుకాగా 180మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆయా కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేశారు. పలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహా జన్ పరిశీలించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ పరి శీలించి పరీక్ష నిర్వహణపై ఆరా తీశారు. పకడ్బందీ గా ప్రశాంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూ చించారు. వారి వెంట అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఆర్డీవో జగదీశ్వర్ రావు తదితరులున్నారు.


