ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరులోపు పీఆర్సీ ప్రకటించా లని, పెండింగ్‌లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఫిట్‌మెంట్ ప్రకటించా లని పేర్కొన్నారు. పాఠశాలల కుదింపు చర్యలు నిలిపివేయాలన్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక టెట్ నిర్వహించాలని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో బదిలీలు, పదో న్నతులు చేపట్టాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బాధ్యులు శ్రీనివాస్, స్వామి, శివన్న, శ్యామ్‌సుందర్, సురేష్, అశోక్, మహేందర్ పాల్గొన్నారు.


