నేరడిగొండ: జిల్లాకు విచ్చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
వైఎస్సార్ హయాంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి
ఆదిలాబాద్: వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి అన్నారు. జిల్లాలో చనాఖా –కోరటా బ్యారేజీకి మాజీ మంత్రి దివంగత సీఆర్‌ఆర్ (సి.రామచంద్రారెడ్డి) పేరును నామకరణం చే స్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా మండలకేంద్రంలో శనివారం సంబరాలు నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు క్షీరా భిషే కం చేశారు. జిల్లాలో రిమ్స్ ఆస్పత్రి, మత్తడివాగు వంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు దివంగత నేత వైఎస్సార్ కారణమని, వీటి నిర్మాణంలో సీఆర్‌ఆర్ చొరవ ఉందని కొనియాడారు. పార్టీ మండల అధ్యక్షుడు రూప్‌రావు, రాందాస్, వామన్ వంకడే, గాన్ శ్యామ్, సంజీవ్ తదితరులు ఉన్నారు.


