కై లాస్‌నగర్: వైద్య విద్య కోర్సులో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఆదివారం మరోసారి నీట్ నిర్వహించనున్నారు. గత నెల 3న పరీక్ష నిర్వహించినా ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా రద్దయిన విషయం తెలి సిందే. దీంతో పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన భద్ర త ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా 1700 మంది హాజరుకానుండగా వీరి కో సం పట్టణంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష ఉంటుంది. బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. తర్వాత గేటును మూసివేస్తారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎండలతీవ్రత నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆయా కేంద్రాల్లో ఏ ఎన్‌ఎంలను నియమించడంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడిసిన్ అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. విద్యార్థులు నీట్ అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, వాటర్‌బాటిల్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకురావద్దని పేర్కొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని బంగారుగూడలో గల నీట్ కేంద్రాలను అదనపు కలెక్టర్ రాయిసిడాం చిత్రు శనివారం పరిశీలించారు. అధికారులను అడిగి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు.


