కై లాస్‌నగర్: పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులు శనివారం పరేడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూ చించారు. చట్టం ముందు అందరూ సమానమేవన ని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పి ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్‌కుమార్, చంద్రశేఖర్, బిడి.ప్రేమ్ కుమార్, కె.ఫణిదర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, ఎన్.చంద్రశేఖర్, సబ్ ఇన్‌స్పెక్ట ర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్‌టౌన్: ఆర్థికనేరాలు నియంత్రించేలా రా త్రి వేళల్లో గస్తీ పటిష్టం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. కార్యాలయ ఆవరణ, వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్‌కుమార్, కె.నాగరాజు, జి.శ్రావణ్, జె.ఫణిధర్, డి.గురుస్వామి, బి.డి.ప్రేమ్‌కుమార్, ప్రణయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


