కై లాస్‌నగర్: కోర్టుల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకరరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పలు సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల రాజీ మార్గం ద్వారా విజయవంతంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమైతే కక్షిదారులకు కోర్టు ఫీజు తిరిగి అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా కాకుండా చూసుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని అన్నారు. అనంతరం సైబర్ క్రైమ్ బాధితుడికి లక్ష ప్రొసీడింగ్ కాపీని, భూసేకరణ లబ్ధిదారులకు రూ.65,33,437విలువ గల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు నగేష్, జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


