విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలి

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

ఉట్నూర్‌రూరల్‌: విద్యుత్‌ సమస్యలు లేకుండా చూ డాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వి ద్యుత్‌శాఖ అధికారులతో సమావేశమై వానాకాలంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. అనంత రం మండలంలోని నవోదయనగర్‌లో రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉచిత విద్యుత్‌ సరఫరాను ప్రా రంభించారు. విద్యుత్‌ సౌకర్యం లేని చోట సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరాకు కృషి చేస్తామని చెప్పారు. గురువారం పులి మడుగుకు చెందిన రిటైర్డ్‌ పోస్ట్‌మేన్‌ రాథోడ్‌ రాంజీ, ఆడే ప్రకాశ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement