పొగాకు రహిత విద్యాసంస్థల ఏర్పాటుకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

పొగాకు రహిత విద్యాసంస్థల ఏర్పాటుకు సహకరించాలి

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

ఆదిలాబాద్‌టౌన్‌: పొగాకు రహిత విద్యాసంస్థ ల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్‌ సైకాలజిస్ట్‌ శ్రీ కాంత్‌ పిలుపునిచ్చారు. జిల్లా వైద్యాధికారి సాధన ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించి మాట్లాడారు. విద్యాసంస్థల పరిధి లో పొగాకు ఉత్పత్తుల వినియోగం, విద్యాసంస్థలకు 100గజాల పరిధిలో విక్రయాన్ని నిషేధి ంచినట్లు చెప్పారు. మైనర్లతో పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, మైనర్లకు విక్రయించడం నిషేధమని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్‌, అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. హెచ్‌ఎం కిషన్‌, పీఈటీ చరణ్‌, సోషల్‌ వర్కర్‌ చిరంజీవి తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement