కైలాస్‌నగర్: వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చై ర్మన్ ముత్తినేని వీరయ్య ఈనెల 21న జిల్లా కేంద్రానికి రానున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బౌనే నగేశ్, ఉగ్గె నానయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జె డ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ది వ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలి పారు. జిల్లాలోని దివ్యాంగులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.


