‘యూరియా యాప్‌ వద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘యూరియా యాప్‌ వద్దు’

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

ఇచ్చోడ: రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ముఖరా(కె) రైతులు డిమాండ్‌ చేశా రు. శుక్రవారం మండలంలోని ముఖరా(కె) లోని పంట పొలాల్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాప్‌ ద్వారా రైతులకు యూరియా దొరడంలేదని తెలిపారు. మెజార్టీ రైతులకు యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకోవ డం కష్టంగా మారిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో యూరియా రైతులకు ఎ ల్లప్పుడు అందుబాటులో ఉండేదని గుర్తు చేశా రు. వెంటనే యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌, గ్రామస్తులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement