కై లాస్‌నగర్: ఎస్‌ఐఆర్–2026 ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షిషా పాల్గొని జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియకు సంబంధించి బీఎల్వోలు, బీఎల్‌ఏలకు శిక్షణతో పాటు కిట్ల పంపిణీ ఇప్పటికే పూర్తయింద ని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చే శామని, ఈనెల 23నాటికి అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు జిల్లా, మండల కేంద్రాల్లో హోర్డింగుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనకు ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, డిప్యూటీ డీఈవోలతో నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. మ్యాపింగ్ కాని ఓటర్లను గుర్తించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని బీఎల్వోలను ఆదేశించినట్లు వివరించారు. ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సహకారం కోసం ఎలాంటి రాజకీయ అనుబంధం లేని స్థానిక వలంటీర్లనే ఎంపిక చేశామని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రూ, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నీట్ (యూజీ) పునఃపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ పునఃపరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం
బజార్‌హత్నూర్: మండలంలోని గులాబ్‌తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. బాల వికాస ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, సింగారెడ్డి, శ్రీలక్ష్మీరెడ్డి, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, సర్పంచ్ రాథోడ్ లక్ష్మీబాయి, శివకుమార్, అరుణ్‌కుమార్, గోవింద్‌రావ్ తదితరులున్నారు.


