ఇచ్చోడ: బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే అ నిల్‌జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.88లక్షలతో చేపట్టిన అదనపు తరగతిగదుల నిర్మాణానికి భూ మిపూజ చేశారు. అనంతరం వారు మాట్లాడు తూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారికి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీఈవో మాధవి, తహసీ ల్దార్ ఇమ్రాన్, ఎంఈవో బిక్కు, కేజీబీవీ ఎస్వో మల్లిక, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాల సందర్శన
బోథ్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించి శుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వసతిగృహంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి మోటారు కొనుగోలు చేసి, బోరు పంపును బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే, అధికారులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ అనురాధ, పాఠశాల చైర్మన్ శోభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన
బోథ్ మండల కేంద్రంలోని కేజీబీవీలో సుమారు రూ.38.15 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేశ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


