‘రైతులను వంచిస్తున్న ప్రభుత్వం’ | - | Sakshi
Sakshi News home page

‘రైతులను వంచిస్తున్న ప్రభుత్వం’

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

ఆదిలాబాద్‌టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని ప్రభుత్వం చెప్పడం రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. యాప్‌లో యూరియా బుకింగ్‌ విధానాన్ని ఎత్తివేయాలని, రైతువేదికల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని విమర్శించారు. వానాకాలం రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, జొన్న రైతులకు వెంటనే చెల్లింపులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లా పర్యటనకు రానున్నట్లు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ యాసం నర్సింగ్‌రావు, నాయకులు గండ్రత్‌ రమేశ్‌, సేవ్వా జగదీశ్‌, పరమేశ్వర్‌, కుమ్రా రాజు, బటు సతీశ్‌, సూర్యకాంత్‌, అనిల్‌, అశోక్‌, దయానంద్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement