కనీస వేతనం చెల్లించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనం చెల్లించాలని ధర్నా

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

కైలాస్‌నగర్‌: మున్సిపల్‌ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ గౌరవా ధ్యక్షుడు దర్శనాల మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవా రం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారు అనూష సతీశ్‌, కమిషనర్‌ జగదీశ్‌గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. అనేక ఏళ్లుగా విధులు ని ర్వహిస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయడం లేదని తెలిపారు. కార్మికుల పీఎ ఫ్‌, ఈఎస్‌ఐ బకాయిల చెల్లింపుల్లోనూ జాప్యం జ రుగుతోందని విమర్శించారు. కాంట్రాక్ట్‌ కార్మికుల ను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులను వెంటనే క్లియర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్‌, యూని యన్‌ అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి నగేశ్‌, సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి సురేందర్‌, డ్రైవర్ల విభాగం అధ్యక్షుడు జనార్దన్‌, కార్యదర్శి భిక్షపతి, నీటి విభాగం నాయకులు చిన్నయ్య, పెంటన్న, అజీమ్‌, శ్యామ్‌, మల్లేశ్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement