వీరనారుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

వీరనారుల త్యాగాలు చిరస్మరణీయం

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

ఆదిలాబాద్‌: వీరనారుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు, బ్రిగేడియర్‌ (రిటైర్డ్‌) ఎన్‌ఆర్‌.బాబు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీ యూ భవనంలో నిర్వహించిన మాజీ సైనికుల సంక్షేమ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు. వీర జవాన్ల సతీమణులు, తల్లులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైనికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చే స్తున్నాయని తెలిపారు. ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా సైనిక సంక్షేమ శాఖను సంప్రదించాలని సూచించారు. ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి రాజేశ్వరరావు, సిబ్బంది షేక్‌ పైముద్దీన్‌, కిశోర్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌దాస్‌, భాస్కర్‌రెడ్డి, శివప్రసాద్‌, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement