అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి

Jun 19 2026 2:00 AM | Updated on Jun 19 2026 2:00 AM

ఆదిలాబాద్‌(బేల): కాంట్రాక్టర్లు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. గురువారం మండలంలోని ఎకోరి, జునోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకోరిలో రూ.20 లక్షలతో పంచాయతీ భవనం ప్రారంభించామన్నారు. రూ.30 లక్షల వ్యయంతో వంతెన, జునోనిలో రూ.5 లక్షలతో సవారీ బంగ్లా నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నిర్మాణంలో నాణ్యత లోపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఇన్‌చార్జి ఎంపీడీవో మహేష్‌ కుమార్‌, సర్పంచులు వాడేయ్‌ రేష్మ, గేడాం కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement