ఉట్నూర్‌రూరల్: రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో టీజీఎ స్పీ సిబ్బందికి ఏర్పాటు చేసిన వంటగదిని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్ధాలపై యువతకు అవగాహన కల్పించాలన్నా రు. ఆర్థిక నేరాలు, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలన్నారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, సీఐ ఎం.ప్రసాద్, ఎస్సై జి.విజయ్ ఉన్నారు.


