‘బడుల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘బడుల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’

Jun 19 2026 2:00 AM | Updated on Jun 19 2026 2:00 AM

ఆదిలాబాద్‌టౌన్‌: పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేతకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు గురువారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఆదిత్య మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి పేద విద్యార్థులపై పడుతున్న ఆర్థికభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీశాంత్‌, శైలేంద్ర, అంకుశ్‌, హరి, శివ, అలోక్‌, ధృవ, హనీష్‌, మనీష్‌, రోహిత్‌, శివచరణ్‌, రామ్‌, అజయ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement