‘రైతుల ఆత్మబంధువు కేసీఆర్‌’ | - | Sakshi
Sakshi News home page

‘రైతుల ఆత్మబంధువు కేసీఆర్‌’

Jun 19 2026 2:00 AM | Updated on Jun 19 2026 2:00 AM

బజార్‌హత్నూర్‌: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టి, రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, కుటుంబ పెద్ద మరణిస్తే రైతుబీమా పథకాలను అమలు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన కేసీఆర్‌ రైతుల మనస్సులో ఆత్మబంధువుగా నిలిచిపోయారని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. గురువారం మండలంలోని కాండ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ అనితరామకిషన్‌, ఉపసర్పంచ్‌ గంగయ్య, గిర్నూర్‌ ఉప సర్పంచ్‌ గొల్లెన రాజేందర్‌ బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచులు పరచ సాయన్న, రాథోడ్‌ ప్రవీణ్‌, సోము రాములు, మెండ్కే సాయినాథ్‌, అనిల్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement