కై లాస్‌నగర్: సిరికొండలోని కొనుగోలు కేంద్రంలో జొన్నలు కొనుగోలు చేయలేదని, అదనపు ఖర్చులు అడిగారని జరుగుతున్న ప్రచారం, ఆరోపణలు అవాస్తవమని జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ మహేశ్‌కుమార్ అన్నారు. మంగళవా రం డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూగురే పాండురంగ్ (48) అనే రైతు తన జొన్న పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన విషయం వాస్తవమేనని, నిబంధనల ప్రకారం ఇతర రైతుల మాదిరిగానే ఆయన సరుకును కూడా తూకం వేసినట్లు తెలిపారు. ఈనెల 6న రైతుకు చెందిన 70 బస్తాల (35 క్వింటాళ్లు) జొన్నలను కొనుగోలు చేసి, రశీదు (తక్‌పట్టి) జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం బయోమెట్రిక్ ద్వారానే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే సరుకు లోడింగ్‌కు ముందు రైతు తన దస్తావేజులను కేంద్రంలో సమర్పించకుండా తిరిగి తీసుకెళ్లారని, వాటిపై ఉన్న లాట్ నంబర్ల ఆధారంగానే లోడింగ్ చేయడం సాధ్యమవుతుందని చెప్పా రు. డాక్యుమెంట్లు తీసుకువచ్చి లోడింగ్ పూర్తి చేయాలని పలుమార్లు కోరినా రైతు తిరిగి కేంద్రానికి రాకపోవడంతో లోడింగ్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందన్నారు. కొనుగోలు కేంద్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులు, ప్రజలను కోరారు.


