వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.

ఈ రైతు పేరు కాడిగిరి నాసర్‌యాదవ్‌. ఈయనది తాంసి. యాసంగిలో జొన్న సాగు చేయగా 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో మే 18న విక్రయించాడు. వీటికి సంబంధించి రూ.2,95,920 రావాల్సి ఉంది. నెల గడుస్తున్నా పైసలు చేతికందలేదు. వానాకాలం సీజన్‌ మొదలు కావడంతో పెట్టుబడి కోసం ప్రభుత్వ బ్యాంకు, ప్రైవేట్‌లో కలిపి రూ.లక్షకు పైగా అప్పు చేశాడు. ఇతనొక్కడే కాదు.. జొన్న దిగుబడులు విక్రయించిన వేలాది మంది రైతులది ఇదే పరిస్థితి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement