సాక్షి, ఆదిలాబాద్: యాసంగిలో జొన్న దిగుబడులు విక్రయించిన రైతులు పంట అమ్మిన డబ్బులకోసం వారాల తరబడి ఎదురుచూస్తున్నారు. పంట విక్రయించిన ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు రూ పాయి చేతికందని పరిస్థితి. ఓవైపు వానాకాలం సీజ న్ మొదలైంది. సాగు పెట్టుబడికి చేతిలో చిల్లి గవ్వ లేక రైతులు బయట అప్పు చేయాల్సిన దుస్థితి. ఒకవేళ సమయానికి ఆ డబ్బులు అంది ఉంటే కొంతలో కొంత పెట్టుబడి భారం తగ్గి రైతుకు వెసులు బాటుగా ఉండేది.
దిగుబడి బారెడు.. కొన్నది మూరెడు
జిల్లాలో యాసంగిలో రైతులు లక్ష ఐదు వేల ఎకరా ల్లో జొన్న సాగు చేశారు. ఎకరానికి 15 నుంచి 25 క్వింటాళ్ల చొప్పున 16లక్షల నుంచి 21లక్షల క్వింటా ళ్ల వరకు దిగుబడి వచ్చింది. మే మొదటి వారంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను విక్రయించారు. అయితే కొనుగోళ్లలో పరిమితి విధించడంతో రైతులు పూర్తిస్థాయిలో మద్దతు ధర కు పంటను అమ్ముకోలేని దుస్థితి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,699 అందినా మొత్తం దిగుబడికి వర్తించలే. గత్యంతరం లేక మిగతా పంటను రైతులు ప్రైవేట్‌లో విక్రయించుకుంటే రూ.2500 నుంచి రూ.3వేల లోపే పలకడం గమనార్హం. ఇది లా ఉంటే మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ముగిసే వరకు కొన్నది కేవలం స్వల్పమే.
ఇంకా మార్కెట్‌లోనే నిల్వలు ..
కొనుగోళ్లు ముగిసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆదిలాబాద్, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో జొన్నల నిల్వలు లోడింగ్‌కాక భారీగా పేరుకుపోయాయి. సుమారు 2వేల టన్నుల వరకు నిల్వ లు ఇంకా గోదాంలకు తరలించాల్సి ఉంది. కూలీల కొరత, లోడింగ్ చేసేందుకు లారీలు రాకపోవడంతో ఈ సమస్య అఽధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.
జిల్లాలో జొన్న కొనుగోళ్ల వివరాలు
విక్రయించిన రైతులు : 25,560
కొనుగోలు చేసిన జొన్నలు : 73 మెట్రిక్ టన్నులు
రైతులకు రావాల్సిన డబ్బులు : రూ.270 కోట్లు
ఒకట్రెండు రోజుల్లో డబ్బులు
జొన్నలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒ కట్రెండు రోజుల్లో రైతులకు డబ్బులు రానున్నాయి. ఈ సీజన్‌లో 7లక్షల 50వేల క్వింటాళ్ల వరకు మార్క్‌ఫెడ్ లక్ష్యం కాగా స్వల్పదూరంలోనే నిలిచాం. ప్రభుత్వం నుంచి డబ్బులు వి డుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జ మచేస్తాం.– మహేశ్‌కుమార్, డీఎం మార్క్‌ఫెడ్


