పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

● ఎమ్మెల్యే శంకర్‌

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మె ల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూషతో కలిసి సుమారు రూ.18.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదిలాబాద్‌ను అభివృద్ధి చెందిన పట్టణంగా మార్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ రానున్నాయని, తద్వారా పట్టణం పారిశ్రామికంగా, ఆర్థికంగా గొప్ప పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మా ట్లాడుతూ పట్టణంలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. గాంధీ పార్క్‌ ప్రహరీని రూ.26 లక్షలతో, పిట్టలవాడ కాలనీలో రూ.10 లక్షలు, రాంనగర్‌ కాలనీలో రూ.32 లక్షలు, డాల్డా కంపెనీ ఏరియాలో రూ.25 లక్షల వ్యయంతో కూడి న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌ గౌడ్‌, ఈఈ అరుణ్‌ కుమార్‌, డీఈలు, ఏఈలు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement