కై లాస్‌నగర్: పర్యావరణ పరిరక్షణ సామాజిక బా ధ్యతగా భావించి మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జి ల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అడవులు, జల వనరుల సంరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్ర తీ దుకాణదారుడు తమ షాపుల ఎదుట మొక్కలు నాటాలని సూచించారు. పిల్లల్లో చిన్నతనం నుంచే పర్యావరణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కాగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకా రులు, విద్యార్థులు నిర్వహించిన నృత్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, పశు సంవర్ధక శాఖ అధికారి రామారావు, ఎఫ్‌డీవో అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌రూరల్: మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌రూరల్ మండలం యాపల్‌గూడ బీట్‌లో హైడెన్సిటీ మిక్స్‌డ్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ నిరోష, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఎఫ్‌డీవో అరవింద్ సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కై లాస్‌నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీరాజ్ భవనాలు, తాగునీటి సరఫరా, గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్, డీపీవో రమేశ్, హౌసింగ్ పీడీ శంకర్, ఏడీ గ్రౌండ్ వాటర్ సతీశ్ యాదవ్ పాల్గొన్నారు.


