భక్తిశ్రద్ధలతో మొహతుక్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో మొహతుక్‌ పూజలు

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

నార్నూర్‌: మండలంలో ఏంపల్లి గ్రామ పంచాయతీ పరిధి గోండుగూడలో శుక్రవారం ఆదివాసీలు సంప్రదాయ బద్ధంగా విజంగ్‌ మొహతుక్‌ పూజా కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పూ జల అనంతరం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి, త్వరలో విత్తనాలు విత్తనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామస్తులు పెందోర్‌ అమృత్‌రావు పటేల్‌, కోట్నాక్‌ శ్రీరామ్‌, పెందోర్‌ జ్యో తిరాం, పూసం జాంబిరావు, మాడవి జల్పత్‌, కోట్నాక్‌ భీంరావు, పూసం లచ్చు, యందొ రావు, కలాబాయి, లచ్చుబాయి, ద్రౌపదిబాయి, పుల్లమ్మ, పారుబాయి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement