తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం! | - | Sakshi
Sakshi News home page

తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం!

Aug 4 2024 11:54 PM | Updated on Aug 5 2024 11:16 AM

-

ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌లో ఘటన

కేసు నమోదు 

ఆదిలాబాద్‌: మద్యానికి బానిసై తమ్ముడు ఏ పనిచేయడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపంతో అన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మస్కాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. పట్టణంలోని పద్మావతినగర్‌ కాలనీకి చెందిన లోనికి సత్తవ్వ, పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

పెద్ద కుమారుడు శివకుమార్‌(33) మలేషియా వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాగా, తమ్ముడు రాకేశ్‌ ఇంటి వద్దే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా మార్పురాలేదు. దీంతో శివకుమార్‌ మనస్తాపం చెంది శనివారం రాత్రి మస్కాపూర్‌ శివారులోని ఓ వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement