విద్యుత్‌ వైర్‌ జాయింట్‌ చేస్తూ నీటిలో దిగుతుండగా.. విషాదం! | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వైర్‌ జాయింట్‌ చేస్తూ నీటిలో దిగుతుండగా.. విషాదం!

Apr 14 2024 11:55 PM | Updated on Apr 15 2024 10:08 AM

- - Sakshi

రాజేశ్‌(ఫైల్‌)

ఆదిలాబాద్‌: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్దన్‌, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం జన్నారం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెల్లి రాజేశ్‌ (28) ఆదివా రం సెలవుదినం కావడంతో తన స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని గోదావరి వద్ద కు వెళ్లారు.

చేపలు పట్టే క్రమంలో రాజేశ్‌ విద్యుత్‌ వైర్‌ జాయింట్‌ చేస్తూ నీటిలో దిగుతుండగా బెడద కృష్ణయ్య విద్యుత్‌ మోటర్‌ స్టార్టర్‌లో వైర్లు పెట్టి ఆన్‌ చేశాడు. ఈ క్రమంలో రాజే శ్‌ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి భార్య తేజస్విని, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తేజస్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సీఐ అల్లం నరేందర్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇవి చదవండి: కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..

Advertisement
 
Advertisement
Advertisement