త్వరలోనే ప్రభాస్‌తో స్పిరిట్‌ | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే ప్రభాస్‌తో స్పిరిట్‌

Aug 17 2024 11:32 PM | Updated on Aug 17 2024 11:32 PM

త్వరలోనే ప్రభాస్‌తో స్పిరిట్‌

త్వరలోనే ప్రభాస్‌తో స్పిరిట్‌

రాజానగరం: ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌తో త్వరలోనే స్పిరిట్‌ సినిమా ప్రారంభమవుతుందని సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌, యానిమల్‌ చిత్రాలు తీసి హిట్‌ కొట్టి ఫామ్‌లో ఉన్న ఆయన స్థానిక జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్వతంత్య్ర ఆసుపత్రి 38వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ముచ్చడించింది. ఆ వివరాలు ఇలా..

ప్రశ్న: మీరు తీసే సినిమాల్లో వైద్యానికి సంబంధించి అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. దానికి కారణాలేంటి?

సందీప్‌రెడ్డి: ఫిజియోథెరపీ కోర్సు చేసిన నేను కొంతకాలం ప్రాక్టీస్‌ కూడా చేశాను. అందువల్ల ఆ ఛాయలు సినిమాల్లో కాస్త డీప్‌గా కనిపిస్తుంటాయి.

ప్రశ్న: వైద్య రంగంలో ఉన్న మీరు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్లారు?

సందీప్‌రెడ్డి: విద్యార్థి దశ నుంచి ఎందుకో సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. సినిమా తీసే విధానాన్ని నిశితంగా పరిశీలించే వాడిని. అందుకే ఫిజియోథెరపిస్టుగా ప్రాక్టీసు చేసే సమయంలోనే సినీ రంగం వైపు అడుగులు పడ్డాయి.

ప్రశ్న: తదుపరి సినిమాల గురించి చెబుతారా..!

సందీప్‌రెడ్డి: ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుంది.

ప్రశ్న: మహేష్‌బాబుతో సినిమా అన్నారు, ఎప్పుడు చేస్తారు?

సందీప్‌రెడ్డి: ప్రస్తుతం అందుకు సమయం లేదు. స్పిరిట్‌ సినిమా తరువాత యానిమల్‌– 2కి వెళ్తాం. ఈ రెండింటికీ కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఆ తరువాతే ఏదైనా ఉంటుంది.

ప్రశ్న: వైద్య విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి?

సందీప్‌రెడ్డి: సినిమాల ద్వారానే నా సందేశం ఏంటో చెబుతూనే ఉన్నాను. ఏదేమైనా చేసే పనిపై ఫోకస్‌ పెట్టాలి. అప్పుడే సరైన ఫలితాలను అందుకోగలుగుతాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement